మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన విజయ్‌ దేవరకొండ !

మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన విజయ్‌ దేవరకొండ !

Published on Nov 18, 2018 4:39 PM IST

విజయ్‌ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మించిన ఈ చిత్రం నిన్న విడుదల అయి మంచి పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులును బాగానే మెప్పిస్తోంది.

పైగా మొదటిరోజు ఓపెనింగ్స్ కూడా బాగానే రాబట్టిందట. నిర్మాతల లెక్కల ప్రకారం ఈ చిత్రం మొదటి రోజున 10.5 కోట్ల గ్రాస్ సొంతం చేసుకొని బ్రేక్ ఈవెన్ సాధించిందని తెలుస్తోంది.

మొత్తానికి బాక్సాపీస్ వద్ద విజయ్ దేవరకొండ మరోసారి తన స్టార్ డమ్ నిరూపించుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు