ఆకట్టుకుంటున్న ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ సాంగ్ ‘నందనందనా’ ప్రోమో

ఆకట్టుకుంటున్న ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ సాంగ్ ‘నందనందనా’ ప్రోమో

Published on Feb 5, 2024 10:03 PM IST

యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. గతంలో విజయ్, పరశురామ్ ల కలయికలో వచ్చిన గీత గోవిందం మూవీ పెద్ద సక్సెస్ సొంతం చేసుకోవడంతో దీని పై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఫ్యామిలీ స్టార్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీని ఏప్రిల్ 5 న తెలుగు, తమిళ భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.
విషయం ఏమిటంటే, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ మూవీ నుండి నేడు కొద్దిసేపటి క్రితం ఫస్ట్ సాంగ్ నందనందనా ప్రోమోని రిలీజ్ చేసారు. మెలోడియస్ గా సాగిన ఈ ప్రోమో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ లిరికల్ సాంగ్ ని అనంత్ శ్రీరామ్ రచించారు. ఫుల్ సాంగ్ ని ఫిబ్రవరి 7న రిలీజ్ చేయనున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా ఈ మూవీతో పాటు సాంగ్స్ విషయంలో కూడా దర్శకుడు పరశురామ్ ఎంతో కేర్ తీసుకున్నారని, తప్పకుండా రిలీజ్ అనంతరం ఫ్యామిలీ స్టార్ మంచి సక్సెస్ అవుతుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సాంగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు