‘మేజర్’ టీజర్.. మెస్మరైజింగ్ మేకింగ్

Published on Apr 12, 2021 5:03 pm IST

26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మేజర్’. అడివి శేష్ ఇందులో ఉన్నికృష్ణన్ పాత్రను చేస్తున్నారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మహేష్ బాబు జిఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది ఉంది. దాన్ని అలాగే మైంటైన్ చేస్తూ వస్తున్నారు టీమ్. సినిమా మీద మరింత క్యూరియాసిటీ పెంచడానికి టీజర్ రిలీజ్ చేశారు.

మహేష్ బాబు, సల్మాన్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ టీజర్ విడుదల చేశారు. టీజర్లో ప్రధానంగా అందరికీ కనెక్ట్ అయ్యే ఒక ఎమోషన్ కనబడుతోంది. శేష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నికృష్ణన్ ను తప్పకుండా గుర్తుచేసేలా ఉంది. ఇక విజువల్స్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం టీమ్ పెట్టిన ఎఫర్ట్ కనబడుతోంది. కేవలం దాడుల అంశాన్నే కాకుండా ఉన్నికృష్ణన్ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను ఇందులో ప్రస్తావించారు. మొత్తానికి టీజర్లో యూనివర్సిల్ అప్పీల్ అయితే కనబడుతోంది. జూలై 2న ఈ చిత్రం పలు భారతీయ భాషల్లో విడుదలకానుంది.

టీజర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :