
‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ ఇషా తల్వార్. మొదటి సినిమాతో హిట్ అందుకొని 8 నెలలు గ్యాప్ తీసుకున్న ఈ భామ మళ్ళీ ‘మైనే ప్యార్ కియా’ సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రదీప్, సత్య దేవ్, ఇషా తల్వార్, మధుమిత కలిసి నటించిన ఈ సినిమాకి ప్రదీప్ దర్శకుడు.
విడుదల సందర్భంగా ఇషా తల్వార్ మీడియాతో మాట్లాడుతూ ‘చిన్నతనంలో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, ప్రేమ ఎలా ఉన్నాయి అదే ఇద్దరి మధ్య 15 ఏళ్ళ తర్వాత ఎలా ఉన్నాయి అన్నదే ఇందులో చూపించాం. ఈ సినిమాలో నా పాత్ర పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. అలాగే ఈ సినిమాతో నాకు తెలుగులో మరింత పేరొస్తుంది. ఈ సినిమాలో నాకున్న మూడు పాటల్ని బ్యాంకాక్ లో కేవలం 6 రోజుల్లో షూట్ చేసాం. అది నాకు బాగా కష్టంగా అనిపించింది. ఈ సినిమాలో డైలాగ్స్ పరంగా, లిప్ సింక్ పరంగా చాలా కేర్ తీసుకున్నానని’ తెలిపింది.

