ఆ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి కల్కి 2898 ఏడి సంతృప్తిని అందిస్తుందా ?

ఆ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి కల్కి 2898 ఏడి సంతృప్తిని అందిస్తుందా ?

Published on Feb 25, 2024 2:00 AM IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినిదత్ నిర్మిస్తుండగా అమితాబ్ బచ్చన్, దిశా పటాని, కమల్ హాసన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మే 9న విడుదల కానుంది. విషయం ఏమిటంటే, ఇటీవల వరుసగా ప్రభాస్ నుండి వచ్చిన మూవీస్ లో ఫ్యాన్స్ ఆశించే మంచి మాస్ సాంగ్స్ అయితే లేవని చెప్పాలి.

ఇక తమ హీరో ఆ తరహా మంచి మాస్ సాంగ్ చేస్తే చూడాలని వారు ఎప్పటినుండో ఆశపడుతున్నారు. లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం కల్కి 2898 ఏడి లో తాజాగా ఒక మాస్ సాంగ్ ని మేకర్స్ చిత్రీకరించారు. అలానే మిగతా ఇతర సాంగ్స్ కూడా ఆడియన్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ని కూడా అలరిస్తాయట. ఆ విధంగా దర్శకుడు నాగ అశ్విన్, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సాంగ్స్ అలానే బీజీఎమ్ విషయంలో కూడా పక్కాగా శ్రద్ద వహిస్తున్నారట. మరి ఇదే కనుక నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు