ఆ విషయంలో ఇళయరాజాని ఫాలోయ్యేవాడిని – మణిశర్మ

ఆ విషయంలో ఇళయరాజాని ఫాలోయ్యేవాడిని – మణిశర్మ

Published on Jul 11, 2014 9:40 AM IST

manisharma
అద్భుతమైన మెలోడీ పాటలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించి మెలోడి బ్రహ్మగా పేరుతెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. దాదాపు 15 ఏళ్ళు కంటిన్యూగా సినిమాలు చేసి ఈ మధ్య కాస్త బ్రేక్ ఇచ్చి స్లోగా సినిమాలు చేస్తున్న మణిశర్మ పుట్టిన రోజు ఈ రోజు. మణిశర్మ సినిమాలు తగ్గించిన రోజు నుంచి ఈ రోజు వరకూ ఆయన పాటలు మిస్ అవుతున్నాం అని చెప్పేవాళ్ళు చేలా మంది ఉన్నారు.

ఇదే ప్రశ్నని ఆయన ముందు ఉంచితే ‘ప్రజలకి నా సంగీతం నుంచి రిలీఫ్ కావాల్సి వచ్చింది.15 ఏళ్ళు దాదాపు అన్ని సినిమాలు నేనే చేశాను. ఇప్పుడొస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన దేవీశ్రీ, తమన్, హారీష్, జోష్వా శ్రీధర్ అందరూ నా దగ్గర పనిచేసిన వారే కదా’ అని మణిశర్మ చెప్పాడు.

మీరు పెద్ద పెద్ద సినిమాలకు చేస్తూనే చిన్న సినిమాలకు మ్యూజిక్ ఎలా చేయగలిగారు అని అడిగితే ‘ఈ విషయంలో నాకు ఓ భయం ఉండేది. అందుకే నేను ఇళయరాజా గారిని చూసి ఆ యాటిట్యూడ్ ని అలవాటు చేసుకున్నాను. ఆయన అంతే పెద్ద సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలు చేసేవారు. అలాగే కొంతమంది దర్శకులు నిర్మాతలు వచ్చి అన్నగారు మీరే ఈ సినిమా చెయ్యాలి. మీరు చేస్తే మాకు లైఫ్ వస్తుంది అనే వాళ్ళు దాంతో చేసేవాడిని. అప్పుడు వాళ్ళ సంతోషంలో నేను ఆనందాన్ని వెతుక్కునేవాన్నని’ అన్నాడు.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

తాజా వార్తలు