నటసింహం బాలకృష్ణ హీరోగా సాలిడ్ లైనప్ ని తన కెరీర్ లో ఇప్పుడు సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన కెరీర్ 111వ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తుండగా దీని తర్వాత ఇమీడియేట్ ప్రాజెక్ట్ గా తన 112వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతో అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా కోసం ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి అప్పట్లోనే వినిపించింది.
ఈ చిత్రానికి దేవర సంగీత దర్శకుడు అనిరుద్ వర్క్ చేస్తాడని టాక్ వచ్చింది కానీ బాలయ్యకి అప్పటికే బ్యాంగర్ ఆల్బమ్స్ ఇచ్చిన థమన్ ని పక్కన పెడతారా అనే టాక్ కూడా వచ్చింది. అయితే దీనిపై ఇప్పుడు మరింత క్లారిటీ వినిపిస్తుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం థమన్ లేదా దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరిలో బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ ఉంటుంది అని తెలుస్తుంది. సో అనిరుద్ ఇప్పుడు లేనట్టే అని చెప్పాలి. థమన్ లేదా దేవి శ్రీ ప్రసాద్ ఇద్దరిలో ఒకరైతే ఖరారు కావచ్చట. సో దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
