అక్కడ కూడా బిజినెస్ లో “పుష్ప 2” దే పై చేయి..

అక్కడ కూడా బిజినెస్ లో “పుష్ప 2” దే పై చేయి..

Published on May 25, 2024 9:56 AM IST


పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్”. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర ఒకసారికొత్త లెక్కలతో బిజినెస్ ని చేస్తుంది.

ఓటిటి హక్కులు నుంచి తెలుగు రాష్ట్రాలు సహా నార్త్ ఇండియా మార్కెట్ లో కూడా పుష్ప 2 కి కనీ వినీ ఎరుగని రీతిలో బిజినెస్ అయ్యింది. అయితే అప్పట్లో ఓవర్సీస్ హక్కులు కూడా సుమారు 100 కోట్లు అంటూ ఓ పుకారు కూడా ఉంది. అయితే ఓవర్సీస్ మార్కెట్ అంతా పక్కన పెడితే అందులో కీలకకమైన నార్త్ అమెరికాలో మాత్రం పుష్ప 2 దే పై చేయి అన్నట్టుగా వినిపిస్తుంది.

అక్కడ ఈ చిత్రానికి ఏకంగా 60 కోట్ల మేర బిజినెస్ అయ్యిందట. ఇది ఈ మధ్య కాలంలో ఉన్న, రానున్న భారీ చిత్రాల్లో హైయెస్ట్ అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే పుష్ప 2 పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు