వినయ విధేయ రామ లో స్పెషల్ సాంగ్ !

వినయ విధేయ రామ లో స్పెషల్ సాంగ్ !

Published on Nov 16, 2018 4:00 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న’వినయ విధేయ రామ’ చిత్రం యొక్క టీజర్ ఇటీవల విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ ను రాబట్టి చిత్రం ఫై అంచనాలను రెట్టింపు చేసింది. ఇక చిత్ర వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట.

‘మమామియా’ .. అంటూ సాగే ఈపాటకు చరణ్ స్టెప్పులు వేస్తున్నారని సమాచారం. హైదరాబాద్లలో వేసిన ప్రత్యేక సెట్లో శోభి మాస్టర్ నేతృత్వంలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇక స్పెషల్ సాంగ్స్ కు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చే దేవి శ్రీ ప్రసాద్ ఈ సాంగ్ ను కూడా అదే తరహాలో కంపోజ్ చేశారట. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు