దిల్ రాజు కార్యాలయంలో ఐటీ సోదాలు !

Published on May 8, 2019 1:02 pm IST

ప్రముఖ నిర్మాత శ్రీ వెంకటేశ్వర క్రీయేషన్స్ అధినేత దిల్ రాజు కార్యాలయంలో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఎఫ్2 తో భారీ బాస్టర్ హిట్ కొట్టారు దిల్ రాజు. ఈచిత్రం 100కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక దిల్ రాజు ,అశ్వినీ దత్ , పివిపి లతో కలిసి మహర్షి అనే చిత్రాన్ని నిర్మించారు.

ప్రస్తుతం ఆయన మహర్షి సినిమా విడుదలలో బిజీ గా వున్నారు. గతంలో కూడా ఐటీ అధికారులు పలు మార్లు దిల్ రాజు ఆఫీస్ లో తనిఖీలు నిర్వహించారు. అయితే తాజాగా మహర్షి విడుదలకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశం అయ్యింది.

సంబంధిత సమాచారం :

More