రాజమండ్రి సెంట్రల్ జైల్లో కమల్ హాసన్

Published on Sep 17, 2019 4:06 pm IST

కమల్ హాసన్, శంకర్ కలిసి చేస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. 23 ఏళ్ల క్రితం వచ్చి సంచలనం క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ చిత్రానికిది సీక్వెల్. అందుకే సినిమా కోసం దక్షిణాది ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ముగియగా ప్రస్తుతం చిత్రీకరణ రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరుగుతోంది. ముఖ్య తారాగణంతో పాటు కమల్ హాసన్ సైతం ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు.

ఈ షెడ్యూల్ ముగియగానే తర్వాతి షూటింగ్ కోసం టీమ్ విదేశాలకు వెళతారని తెలుస్తోంది. కాజల్ కూడా ఈ యేడాది ఆఖరి నుండి షూటింగ్లో పాల్గొననుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘భారతీయుడు 2’ పేరుతో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More