రేపు “ఇండియన్ 2” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

రేపు “ఇండియన్ 2” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

Published on May 21, 2024 1:00 PM IST

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇండియన్ 2. తెలుగులో భారతీయుడు 2 గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంను జూలై 12 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

నేడు సాయంత్రం 5:00 గంటలకు ఫస్ట్ సింగిల్ ప్రోమో ను రిలీజ్ చేయనున్నారు. రేపు సాయంత్రం 5:00 గంటలకు పూర్తి పాట రిలీజ్ కానుంది. భారతీయ ప్రధాన భాషల్లో పాటను రిలీజ్ చేయనున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్‌ బ్యానర్ లపై చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మూడో పార్ట్ మరో ఆరు నెలల్లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు