కమల్ హాసన్ – శంకర్ కలయికలో భారతీయుడు సీక్వెల్ ను ఎప్పటి నుండో రూపొందించాలని ప్లాన్ చేసుకొని.. చివరికి సినిమాను ఘనంగా ప్రారంభించి.. మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసే క్రమంలో కొన్ని కారణాల వల్ల షూటింగ్ కి మధ్యలోనే బ్రేక్ ఇచ్చారు. ఆ తరువాత షూటింగ్ ను మళ్లీ ప్రారంభించాలనుకున్నప్పటికీ.. ఎందుకో షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు. ముఖ్యంగా బడ్జెట్ విషయంలోనే శంకర్ కి లైకా ప్రొడక్షన్స్ సంస్థతో విభేదాలు వచ్చాయి, అందుకే సినిమా మొదలవట్లేదు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ పోటీ చేస్తుండటం వల్ల సినిమాను కమల్ కొన్నాళ్ళు పక్కన పెట్టారని అన్నారు.
అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాణ సంస్థ లైకాకు, డైరెక్టర్ శంకర్ కు బేదాభిప్రాయాలు వచ్చే.. సినిమా ఆగిందట. శంకర్ ఈ సినిమాను బడ్జెట్ పరిమితులు లేకుండా మరో పెద్ద బ్యానర్లో చేయాలని చాల ప్రయత్నించారట. కానీ అది సెట్ కాలేదు. మొత్తానికి మళ్లీ లైకా ప్రొడక్షన్స్ లోనే ఆ సంస్థ ఇచ్చిన బడ్జెట్ పరిమితుల్లోనే శంకర్ సినిమా చెయ్యడానికి అంగీకరించారట. శంకర్ భారతీయుడు 2 కోసం మొత్తానికి సద్దుకుపోవాల్సి వచ్చింది. ఇక సినిమా షూటింగ్ ఆగస్ట్ నుండి మొదలవుతుందని తెలుస్తోంది.