చరణ్ ఒక నిశ్శబ్ద విధ్వంసం.. ఇండియాస్ ఇద్దరు టాప్ దర్శకులూ అదే మాట

చరణ్ ఒక నిశ్శబ్ద విధ్వంసం.. ఇండియాస్ ఇద్దరు టాప్ దర్శకులూ అదే మాట

Published on Mar 27, 2024 11:00 AM IST

ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆనందంగా గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తాలూకా పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున అందరి హీరోస్ లానే ఈసారి చరణ్ బర్త్ డే కూడా క్రేజీ ట్రీట్ లు రావడం మొదలయ్యాయి. అలా పాన్ ఇండియా దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ సినిమా “గేమ్ చేంజర్” (Game Changer) నుంచి మోస్ట్ అవైటెడ్ సాంగ్ జరగండి రిలీజ్ అయ్యింది.

మరి ఈ సాంగ్ ని ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక చరణ్ బర్త్ డే కి గాను అనేకమంది ప్రముఖులు బర్త్ డే విషెష్ కూడా తెలియజేస్తున్నారు. అలా ఇప్పుడు గేమ్ చేంజర్ దర్శకుడు శంకర్ తెలియజేసిన పవర్ ఫుల్ విషెష్ అయితే మెగా ఫ్యాన్స్ కి ఎంతో ఆనందం కలిగిస్తున్నాయి. శంకర్ ఒక నటుడు పట్ల ఎంత పర్టిక్యులర్ గా ఉంటారో అనేది అందరికీ తెలుసు. తనకి మెప్పించడం అనేది కూడా మామూలు విషయం కాదు.

అయితే రామ్ చరణ్ మాత్రం తన పెర్ఫామెన్స్ తో దర్శకులని అబ్బురపరచడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ఇండియన్ సినిమా దగ్గర టాప్ దర్శకులు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి అలాగే దర్శకుడు శంకర్ లతో వర్క్ చేసిన హీరోగా చరణ్ నిలవగా ఈ ఇద్దరినీ కూడా తాను అమితంగా ఇంప్రెస్ చేయడం విశేషం. చరణ్ కోసం శంకర్ లేటెస్ట్ గా పోస్ట్ చేస్తూ పనికి ముందు చరణ్ ఎంత నిశ్శబ్దంగా హంబుల్ గా ఉంటాడో ఒక్కసారి యాక్షన్ లోకి దిగితే పిడుగులా విధ్వంసం చూపిస్తాడని శంకర్ ఒక ఊహించని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.

మరి ఇదే తరహాలో ఒకప్పుడు రాజమౌళి కూడా కామెంట్స్ చేయడం విశేషం. షూటింగ్ ముందు వరకు చాలా కామ్ గా కనిపించే చరణ్ ఒక్కసారి కెమెరా ముందుకు వస్తే ఇంకో లెవెల్లో ఉంటుంది అని RRR ప్రీ రిలీజ్ టైం లో కామెంట్స్ చేశారు. ఇలా ఈ ఇద్దరు ఇండియాస్ టాప్ దర్శకులకి కూడా చరణ్ తన వర్క్ తో ఈ రేంజ్ లో అనిపించేలా చేయడం గమనార్హం. మొత్తానికి అయితే చరణ్ బర్త్ డే నాడు ఫ్యాన్స్ కి కావాల్సిన సాలిడ్ హై ఒకొకటిగా వస్తుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు