ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : 19 జూలై , 2026
123తెలుగు.కామ్ రేటింగ్ 2.75/5
నటీనటులు : ఇంద్రజ, మోహన, శ్రీ శరన్, సునీతా మనోహర్ తదితరులు
దర్శకత్వం : అవినాష్ మాచిరాజు
నిర్మాత : రికీ మార్టిన్
సంగీతం : శ్రవణ్ శ్రీధర్
ఛాయాగ్రహణం : లోకేష్ సన్నీ
కూర్పు : నోహ్ మెషెక్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘అనగనగా ఓ శుక్రవారం’. వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
తండ్రి లేని ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేసే యువతి మేఘనకి (మోహన) తన తల్లి లక్ష్మి (ఇంద్రజ) తో తన వర్క్, టైమింగ్స్ విషయంలో గొడవపడుతూ ఉంటుంది. తన తల్లి చూపించే అతి జాగ్రత్త ఆమెని కంట్రోల్ చేయాలని చూస్తుంది అన్నట్టుగా ఆమె భావిస్తుంది. ఇలా గొడవ తర్వాత ఉదయానికి ఊహించని విధంగా ఇద్దరి ఆత్మలు ఒకరిది ఒకరికి మారిపోతాయి. సో ఈ మారిన పరిస్థితులని ఇద్దరూ ఎలా నెట్టుకొచ్చారు? ఈ క్రమంలో ఇద్దరు తల్లీ కూతుర్లు ఏం తెలుసుకున్నారు? అసలు ఇద్దరూ ఎందుకు అలా మారారు? చివరికీ మళ్ళీ ఎవరి ఆత్మలు వారిలోకి వచ్చాయా లేదా అనేది ఇందులో మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ లఘు చిత్రంలో కాన్సెప్ట్ ఒకింత పర్వాలేదని చెప్పవచ్చు. ఈ సిరీస్ పరంగా చూసుకుంటే బాగా కొత్తదే.. కానీ ఇందులో ఇంద్రజ, మోహన నడుమ ఎమోషనల్ పార్ట్ కొన్ని చోట్ల బాగా వర్క్ అయ్యిందని చెప్పవచ్చు.
దర్శకుడు ఇద్దరిపై రాసుకున్న కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అలాగే ఇంద్రజ, మోహన కూడా తమ పాత్రల్లో బాగా చేశారు. ఇద్దరికీ ఇవ్వబడ్డ రెండు వేరియేషన్స్ లో ఇద్దరూ బాగా నటించారు. అలాగే ఇందులో మరో ఇంప్రెస్ చేసే అంశం మ్యూజిక్ అని చెప్పొచ్చు.
బ్రీజీగా ట్రెండీ ట్యూన్స్ తో పాటుగా ఏ ఎమోషన్ కి తగ్గట్టుగా ఆ ఎమోషన్ కి సంగీత దర్శకుడు కథనానికి మంచి ఫ్లోని తన సంగీతంతో అందించాడు. అలాగే నటుడు శ్రీసరణ్ కూడా బాగా చేసాడు.
మైనస్ పాయింట్స్:
కాన్సెప్ట్ కథా సుధ వరకు కొత్తదే కావచ్చు కానీ ఇదే తరహా కాన్సెప్ట్ లు ఇది వరకు చాలానే వచ్చేసాయి. ఫాంటసీ టచ్ తో ఓ బేబీ నుంచి రీసెంట్ గానే తమిళ్ లో వచ్చిన డబుల్ అక్యుపెన్సీ వరకు ఈ స్వాపింగ్ కాన్సెప్ట్ లు కనిపించాయి.
అలానే ‘ఫ్రీకీ ఫ్రైడే’ అనే ఇంగ్లీష్ సినిమా కాన్సెప్ట్ కి బాగా దగ్గరగా ఉంది. సో మరీ సినిమాలు ఎక్స్ ప్లోర్ చేసేవారికి ఇందులో కాన్సెప్ట్ అంత కొత్తగా అనిపించకపోవచ్చు. అలానే ఎండింగ్ ని ఇంకా బలంగా ప్లాన్ చేసుకోవాల్సింది.
రొటీన్ లవ్ ట్రాక్, ఓ సింపుల్ ఎండింగ్ తో ఇది ముగిసిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా పాత్రలు ఒక దాని నుంచి మరొకటి మారడం మూలాన మధ్యలో కొంచెం కన్ఫ్యూజన్ గా కూడా అనిపించవచ్చు.
సాంకేతిక వర్గం:
ఇందులో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే టెక్నికల్ గా కూడా సినిమా బలంగా ఉంది. శ్రవణ్ శ్రీధర్ ఇచ్చిన సంగీతం మాత్రం బాగా వర్కౌట్ అయ్యింది. కెమెరా వర్క్, ఎడిటింగ్ లు బానే ఉన్నాయి. ఇక దర్శకుడు అవినాష్ మాచిరాజు విషయానికి వస్తే.. తన వర్క్ కొంతమేరకు బాగానే అనిపిస్తుంది. అడాప్ట్ చేసుకున్న ఫాంటసీ సబ్జెక్టులో ఇంకాస్త డెప్త్ ని, ఎమోషన్స్ ని జోడించి ఉంటే బాగుండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘అనగనగా ఓ శుక్రవారం’ అనే లఘు చిత్రం కొంతమేర బాగానే అనిపిస్తుంది. ఫాంటసీ టచ్ ఓకే కానీ ఇది ఒకింత రొటీన్ గానే అనిపిస్తుంది. కానీ ఇంద్రజ, మోహన నడుమ కొన్ని సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతాయి. సో వీటి వరకు ఓకే అనిపిస్తుంది కానీ మిగతా కథనం రొటీన్ గానే ఉన్నాయి. వీటితో తక్కువ అంచనాలు పెట్టుకొని దీనిని ట్రై చేస్తే మంచిది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
