రవితేజ నటించిన ‘నిప్పు’ ప్రత్యేక సమాచారం

రవితేజ నటించిన ‘నిప్పు’ ప్రత్యేక సమాచారం

Published on Jan 19, 2012 12:13 PM IST


మాస్ మహారాజ రవితేజ తన తరువాత చిత్రం ‘నిప్పు’తో ప్రేక్షకులని అలరంచడానికి రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన సమాచారం మాకు లభించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శ్రీరామ్ (రోజాపూలు ఫేం) దీక్షా సేథ్ కి అన్నయ్య గా కనిపించబోతున్నారు. మరియు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు శ్రీరామ్ మరియు దీక్షా సేథ్ లకు తండ్రిగా కనిపించబోతున్నారు. ప్రముఖ హీరొయిన్ భావన శ్రీరామ్ ప్రియురాలిగా ప్రత్యేక పాత్రలో నటించారు.

ప్రదీప్ రావత్ విలన్ గా నటించగా యాక్షన్ సన్నివేశాలు బాగా చిత్రీకరించారని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. నిప్పు చిత్రాన్ని గుణశేఖర్ డైరెక్ట్ చేయగా వైవిఎస్ చౌదరి నిర్మాత. తమన్ అందించిన ఈ చిత్ర ఆడియో రేపు విడుదలవుతుండగా సినిమాని ఫిబ్రవరి 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ 123తెలుగు.కామ్ లో ప్రత్యేకంగా అందిస్తాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు