ఇంట్రెస్టింగ్..సరిగ్గా 104 ఏళ్ళు కితం ‘నాటు నాటు’

ఇంట్రెస్టింగ్..సరిగ్గా 104 ఏళ్ళు కితం ‘నాటు నాటు’

Published on Feb 15, 2024 8:00 AM IST

గ్లోబల్ హీరోస్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకేకించిన గ్లోబల్ సెన్సేషన్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఆస్కార్ వరకు కూడా వెళ్లి ఇండియన్ సినిమా ఘనతని చాటి చెప్పింది. అయితే ఈ సినిమాని గ్లోబల్ లెవెల్లో నిలిపిన సాంగ్ “నాటు నాటు” ప్రభంజనం కోసం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఎలెక్ట్రిఫయింగ్ డాన్సర్స్ తాలూకా పొటెన్షియల్ బాగా తెలిసిన రాజమౌళి, కీరవాణితో కలిసి రెడీ చేయించుకున్న ఈ సాంగ్ ఒక గ్లోబల్ సెలబ్రేషన్ సాంగ్ గా మారి ఆస్కార్ అందుకుంది. అయితే లేటెస్ట్ గా మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. నిన్న ఫిబ్రవరి 14న సరిగ్గా 104 ఏళ్ల కితం రామ్ మరియు భీం లు నాటు నాటు సాంగ్ కి డాన్స్ చేసారని తెలిపారు.

అంటే ఇప్పుడు 2024 కాబట్టి 1920 ఫిబ్రవరి 14న నాటు నాటు సాంగ్ కి అప్పట్లో ఫిక్షనల్ గా కలిసిన రామ్ అండ్ భీం లు కాలు కదిపారని షేర్ చేశారు. దీనితో ఈ పోస్ట్ మంచి ఎగ్జైటింగ్ గా కాలాన్ని వెనక్కి తీసుకెళ్లింది. ఇక ఈ భారీ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవగన్ తదితరులు నటించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు