స్టూడెంట్ పాత్రలో కనిపించనున్న మహేష్ బాబు !
Published on Jun 9, 2018 3:04 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క 25వ చిత్రం ఈ నెల 17వ తేదీ నుండి హిల్ స్టేషన్ డెహ్రాడూన్ లో మొదలుకానున్న సంగతి తెలిసిందే. టీ-టౌన్ లో వినిపిస్తున్న వార్తల మేరకు ఈ చిత్రంలో మహేష్ ఎంబిఏ చదివే విద్యార్థిగా కనిపిస్తారట. ఆ పాత్ర కోసమే ఆయన గడ్డం పెంచి యంగ్ లుక్ ట్రై చేస్తున్నారట. త్వరలోనే యూనిట్ కాలేజ్ బ్యాక్ డ్రాప్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.

అయితే ఈ వార్తలు నిజమో కాదో తేలాలంటే అధికారిక ప్రకటన వెలువడే వేచి చూడాల్సిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్ కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగనున్న ఈ సినిమాలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి పనిచేయనున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook