‘ఆర్ఆర్ఆర్’లో సాయి పల్లవి.. నిజమెంత ?

Published on Jun 1, 2019 2:00 am IST

రాజమౌళి చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకున్న ఏకైక సమస్య హీరోయిన్ దొరక్కపోవడం. మొదట ఇందులో తారక్ పాత్రకు జోడీగా హాలీవుడ్ నటి డైసీ ఎడ్గర్ నటిస్తుందని ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. అప్పటి నుండి ఆమె స్థానంలో ఇంకో నటి కుదరలేదు. రాజమౌళి తానూ నాకున్న క్వాలిటీస్ ఉన్న నటి కోసం అన్ని పరిశ్రల్నీ జల్లెడ పెట్టేస్తున్నారు.

తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న వార్తల మేరకు జక్కన్న ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి
అయితే ఎలా బాగుంటుందని, ఆమెనే తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది కేవలం పుకారు మాత్రమేనా లేకపోతే నిజమా అనేది తెలియాల్సి ఉంది. ప్రేక్షకులు మాత్రం ఎన్టీఆర్, సాయి పల్లవి ఇద్దరూ మంచి నటులే కాబట్టి కలిసి నటిస్తే బాగుంటుందని, కొత్తగా కూడా ఉంటుందని అంటున్నారు. మరి రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇకపోతే ఇందులో రామ్ చరణ్ సరసం అలియా భట్ నటించనుంది. సుమారు 350 కోట్ల బడ్జెట్ కేటాయించి నిర్మిస్తున్న ఈ సినిమా ‘బాహుబలి’ మాదిరిగానే అన్ని దాదాపు భారతీయ భాషల్లోనూ విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More