అల్లు అర్జున్ – అట్లీ మూవీ పై ఇంట్రెస్టింగ్ బజ్

అల్లు అర్జున్ – అట్లీ మూవీ పై ఇంట్రెస్టింగ్ బజ్

Published on Apr 1, 2024 9:31 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ తో పుష్ప 2 మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగష్టు 15న ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, త్వరలో దీని అనంతరం తమిళ దర్శకుడు అట్లీ తో అల్లు అర్జున్ వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వీరిద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ జరుగగా దీని అనౌన్స్ మెంట్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న రానుందని అంటున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజక్ట్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దాని ప్రకారం ఈ మూవీ భారీ యాక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ గా రూపొందనుండగా ఇందులో త్రిష లేదా సమంత లో ఒకరు హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ గురించిన మరిన్ని వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు