బాలయ్య – హరీష్ శంకర్ మూవీ పై ఇంట్రెస్టింగ్ బజ్

బాలయ్య – హరీష్ శంకర్ మూవీ పై ఇంట్రెస్టింగ్ బజ్

Published on Feb 12, 2024 7:59 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల భగవంత్ కేసరి మూవీతో పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు బాబీతో ఆయన తన కెరీర్ 109 మూవీ చేస్తున్నారు. అనంతరం గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక మూవీ చేయనున్నారు బాలకృష్ణ .ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ బజ్ అయితే టాలీవుడ్ లో వైరల్ అవుతోంది.

దాని ప్రకారం ఈ మూవీ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. తన మార్క్ స్టైల్ తో పాటు బాలయ్య మార్క్ డైలాగ్స్, యాక్షన్ ఇందులో పొందుపరచనున్నారట దర్శకుడు హరీష్ శంకర్. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన మిగిలిన వివరాలు త్వరలో ఒక్కొక్కటిగా రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు