పవన్ కళ్యాణ్ డైరెక్టర్ మళ్లీ రీమేక్ నే నమ్ముకున్నాడా ?

పవన్ కళ్యాణ్ డైరెక్టర్ మళ్లీ రీమేక్ నే నమ్ముకున్నాడా ?

Published on Nov 15, 2018 10:30 AM IST

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో హ‌రీష్ శంక‌ర్‌ స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందాడు. కానీ గత కొన్ని సినిమాలుగా హ‌రీష్ శంక‌ర్‌ డైరెక్ట్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. ‘దబాంగ్’ చిత్రాన్ని తెలుగులో ‘గబ్బర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బ్లాస్టర్ కొట్టినట్లుగానే.. ఇప్పుడు మరోసారి రీమేక్ సినిమానే నమ్ముకున్నట్లు తెలుస్తోంది.

కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘జిగర్తాండ్రా’ ను తెలుగులో హరీష్ శంక‌ర్‌ రీమేక్ చేయాలనుకుంటున్నాడట. ఇపటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తినట్లు సమాచారం. కాగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే ఈ చిత్రం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు