టాక్..”లియో” నుంచి మరో వెర్షన్ కూడా.?

టాక్..”లియో” నుంచి మరో వెర్షన్ కూడా.?

Published on Nov 29, 2023 2:30 PM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “లియో”. మరి మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం థియేట్రికల్ గా విజయ్ లోకేష్ ల కెరీర్ లో రికార్డ్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ రిలీజ్ అనంతరం సినిమా రీసెంట్ గా ఓటీటీ లో కూడా రిలీజ్ కి వచ్చాయి.

పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం ఇప్పుడు అందుబాటులోకి రాగా ఇండియా సహా యూఎస్ వెర్షన్ లని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు కొన్ని రూమర్స్ లియో యూనివర్సల్ వెర్షన్ కోసం తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఉన్న భాషలోనే కాకుండా ఇంగ్లీష్ లో కూడా వస్తుంది అంటూ రూమర్స్ మొదలయ్యాయి.

అలాగే డిసెంబర్ చివరలో ఈ వెర్షన్ ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా 7 స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు