‘ఓజి 2’ పై ఇంట్రెస్టింగ్ బజ్!

‘ఓజి 2’ పై ఇంట్రెస్టింగ్ బజ్!

Published on Jun 23, 2026 9:04 PM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న అవైటెడ్ సీక్వెల్ సినిమానే ఓజి 2. దీనిపై ఉన్న హైప్ ఇప్పుడు అంతా ఇంతా కాదు. అందుకు తగ్గట్టే మేకర్స్ కూడా సాలిడ్ అప్డేట్స్ వరుసగా అందిస్తూ వస్తున్నారు. దీనితో వారి ఆనందానికి కూడా అవధులు లేవు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఇపుడు వినిపిస్తోంది. ఈ సినిమాకి పార్ట్ 1 నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ తప్పుకున్నట్టే అని అందరికీ అర్ధం అయ్యిపోయింది.

ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ నిర్మాణంలో ఉంటుంది అని తెలిసిందే. కానీ పవన్ తో పాటు మరో నిర్మాణ సంస్థ కూడా భాగస్వామ్యం అవుతుంది అని టాక్ వచ్చింది. కానీ ఇందులో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. కేవలం పవన్ నిర్మాణ సంస్థ ఇప్పుడు వరకు పార్ట్ 2 నిర్మాణ బాధ్యత తీసుకున్నారట. మరో నిర్మాణ సంస్థ ఉంటుందా లేదా అనేది ముందు రోజుల్లో తెలియవచ్చు. అంతే కాకుండా సినిమా నటీనటులు ఎంపిక కూడా ఇంకా మొదలు కావాల్సి ఉందని టాక్. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు