“పుష్ప 3” పై ఇంట్రెస్టింగ్ బజ్.!

“పుష్ప 3” పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on May 27, 2024 12:01 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” (Pushpa 2) కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ చిత్రం షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవ్వడం ఇంకో పక్క అప్డేట్స్ కూడా వరుసగా వస్తుండడంతో మంచి హైప్ లో సినిమా వెళ్ళిపోతుంది.

ఇక ఈ చిత్రానికి కూడా కొనసాగింపుగా మూడో పార్ట్ ఉంటుంది అని అందరికీ తెలిసిందే. మరి దీనిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ గా వినిపిస్తుంది. దీని ప్రకారం ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ అయ్యిన తర్వాత మేకర్స్ వెంటనే పార్ట్ 3 ని చేయరట. దీనిని చేసే గ్యాప్ లో సుకుమార్ ఓ రెండు చిత్రాలు అల్లు అర్జున్ ఓ రెండు సినిమాలు వేరే వేరేగా చేసి అప్పుడు మళ్ళీ మూడో సినిమాకి కలుస్తారని తెలుస్తుంది.

దీనితో పార్ట్ 3 రావడానికి అయితే చాలా సమయం పడుతుంది అని చెప్పాలి. ఇక ఈ పుష్ప 2 నుంచి రెండో సాంగ్ రాబోతుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు