సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబోలో తెరకెక్కిస్తున్న సాలిడ్ స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం రిలీజ్ పై ప్రస్తుతం సరికొత్త ఊహాగానాలు వైరల్ అవుతుండగా దానిని పక్కన పెడితే ఈ సినిమాపై ప్రస్తుతానికి మోస్ట్ అవైటెడ్ గా అప్డేట్ పై మాత్రం లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ బజ్ మొదలయ్యింది.
రీసెంట్ గా వచ్చే ఏడాది రానున్న అన్ని సినిమాలకు సంబంధించి ఆల్ మోస్ట్ ఫస్ట్ సింగిల్స్ వచ్చేసాయి. కానీ ఇంకా సర్కారు వారి పాట, రాధే శ్యామ్ ల నుంచి మాత్రం బ్యాలన్స్ ఉన్నాయి. మరి వీటిలో సర్కారు వారి ఫస్ట్ సింగిల్ పైనే బజ్ స్టార్ట్ అయ్యింది. దీని ప్రకారం అయితే ఈ సినిమా ఫస్ట్ సింగ్ దీపావళి కానుకగా రావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అసలే థమన్ మహేష్ ల కాంబో నుంచి ఇది మరో సినిమా అందుకే అంచనాలు కూడా భారీ గానే ఉన్నాయి. పైగా థమన్ ఈ సినిమాకి కూడా నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. మరి ఈ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనా కాదా అన్నది వేచి చూడాలి.
