రానా హీరోనా విలనా..కన్ఫ్యూషన్ లో వెంకటేష్ ..!

రానా హీరోనా విలనా..కన్ఫ్యూషన్ లో వెంకటేష్ ..!

Published on Feb 29, 2020 3:43 PM IST

రానా దగ్గుబాటి నటుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. 2010లో ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ పదేళ్ల కెరీర్ లో ఓ పక్క హీరోగా చేస్తూనే రానా హీరోగా కాకుండా అన్ని రకాల పాత్రలు ట్రై చేశారు. బాహుబలి మరియు కొన్ని చిత్రాలలో విలన్ రోల్ చేశారు. సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు.

రానా పదేళ్ల ఇండస్ట్రీ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ సురేష్ ప్రొడక్షన్స్ ఓ వీడియో చేయగా అందులో వెంకటేష్ రానా గురించి ఇలా అన్నారు. రానా హీరోనా, విలనా లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నా అంటే.. ప్రతి కోణంలో రానా ఉన్నాడు అని అబ్బాయిని వెంకటేష్ పొగిడేశారు. ఇక తండ్రి సురేష్ బాబు, దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా రానా ని పొగడ్తలతో ముంచెత్తారు. సురేష్ ప్రొడక్షన్స్ లో ఓ భారీ చిత్రాన్ని రానా హీరోగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు