సుహాస్ పై డైరెక్టర్ సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సుహాస్ పై డైరెక్టర్ సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Apr 27, 2024 12:34 AM IST

యువ నటుడు సుహాస్ ప్రస్తుతం హీరోగా మంచి సక్సెస్ లతో కొనసాగుతున్నారు. ఇటీవల అంబాజీ మ్యారేజి బ్యాండు మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన సుహాస్, తాజాగా ప్రసన్నవదనం మూవీ చేస్తున్నారు. నేడు ఈమూవీ యొక్క ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ దస్పల్లా కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరుగగా దీనికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి ట్రైలర్ లాంచ్ చేసారు. అనంతరం సుకుమార్ మాట్లాడుతూ, సుహాస్ మంచి టాలెంట్ ఉన్న యాక్టర్ అని అన్నారు.

పుష్ప లో మొదట కేశవ పాత్రకు తననే అనుకున్నాం, అయితే అప్పటికే అతడు హీరోగా చేస్తుండడంతో ఆ పాత్రకి తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది అన్నారు. ఇక అతడు రాబోయే రోజుల్లో నటుడిగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడం ఖాయం అని, అలానే తనని చూస్తుంటే ఫ్యూచర్ నాని లా అనిపిస్తున్నది అన్నారు. నాచురల్ స్టార్ నాని మాదిరిగానే సుహాస్ యాక్టింగ్ కూడా ఎంతో నాచురల్ గా ఉంటుందని తెలిపారు. ప్రసన్నవదనం ట్రైలర్ తనకు బాగా నచ్చిందని, మూవీ యూనిట్ కి తన తరపున బెస్ట్ విషెస్ తెలిపారు సుకుమార్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు