‘మిరాయ్’ స్టోరీ పై తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘మిరాయ్’ స్టోరీ పై తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Apr 18, 2024 7:24 PM IST

ఇటీవల పాన్ ఇండియన్ మూవీ హను మాన్ తో పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న తేజ సజ్జ తాజాగా ఈగిల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనితో మిరాయ్ మూవీని అనౌన్స్ చేసారు. ఇందులో సూపర్ యోధగా కనిపించనున్నారు తేజ. ఈమూవీలో రితిక నాయక్ హీరోయిన్ గా నటించనుండగా మంచు మనోజ్ కీలక పాత్ర చేయనున్నారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా నేడు దీని టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు.

ఆకట్టుకునే ఎలిమెంట్స్ తో అలరించే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మిరాయ్ గ్లింప్స్ ఎంతో బాగుంది. ఇక ఈ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా హీరో తేజ సజ్జ మాట్లాడుతూ, ఈ మూవీ కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకునేలా దర్శకుడు కార్తీక్ అద్భుతంగా రూపొందించారని, అయితే టేకింగ్ పరంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నప్పటికీ ఈ కథ పూర్తిగా మన హైదరాబాద్ గల్లీల్లో తిరిగే అబ్బాయి చుట్టూ సాగుతుందని, తప్పకుండా ఆడియన్స్ తమ మూవీని ఆదరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేసారు తేజ. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు