‘అశ్వద్దామ’ కాన్సెప్ట్ పోస్టర్.. ఇట్స్ ఇంట్రెస్టింగ్

‘అశ్వద్దామ’ కాన్సెప్ట్ పోస్టర్.. ఇట్స్ ఇంట్రెస్టింగ్

Published on Nov 29, 2019 6:59 PM IST

Aswathama

యంగ్ హీరో నాగశౌర్య చేస్తున్న సినిమాల్లో ‘అశ్వద్దామ’ కూడా ఒకటి. రమణ తేజ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. మినీ టీజర్ అనేలా ఉన్న పోస్టర్ చూస్తే సినిమా ఫుల్ లెంగ్త్ క్రైమ్ డ్రామా అని అర్థమవుతోంది. అది కూడా ఒక క్రైమ్ కాదు అనేక రకాల క్రైమ్స్ అని అట్టే తెలిసిపోతోంది.

హీరో నాగశౌర్యని సైతం ఇంతవరకు ఏ దర్శకుడూ చూపని రీతిలో చాలా ఫెరోషియస్ గా చూపారు. మొత్తానికి మోషన్ పోస్టర్ సినిమాపై మంచి ఆసక్తిని క్రియేట్ చేయగలిగింది. సినిమాలో కూడా ఆద్యంతం ఇలాంటి కంటెంటే ఉంటే విజయం పెద్ద కష్టమేనీ కాదు. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన మెహ్రీన్ ప్రిజాద కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమాను నాగశౌర్య స్వయంగా తన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

కాన్సెప్ట్ పోస్టర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు