ఇంట్రెస్టింగ్.. పవన్ సినిమాకి దర్శకుడి పేరు మిస్సింగ్..

ఇంట్రెస్టింగ్.. పవన్ సినిమాకి దర్శకుడి పేరు మిస్సింగ్..

Published on Apr 30, 2024 4:03 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawankalyan) హీరోగా చేస్తున్న పలు భారీ చిత్రాల్లో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో చేస్తున్న పీరియాడిక్ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి మరి ఈ సినిమా నుంచి ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న టీజర్ అప్డేట్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

అయితే ఈరోజు అప్డేట్ ఇచ్చిన పోస్టర్స్ లో ఎక్కడ కూడా దర్శకుడు క్రిష్ పేరు ఎక్కడా కనిపించలేదు. దీనితో ఇది ఇప్పుడు హైలైట్ గా మారింది. అయితే ఇందులో కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. అక్కడ మేకర్స్ ప్లైన్ గా డిజైన్ చేసిన పోస్టర్ మాత్రమే ఇది. కేవలం సినిమా పేరు హీరో నిర్మాణ సంస్థ పేరు మాత్రమే ఇచ్చారు.

ఇతర టెక్నికల్ టీం ఎవరి పేరు కూడా పెట్టకపోవడం గమనించాలి. సో దర్శకుడు కానీ సంగీత దర్శకుడు సినిమాటోగ్రాఫర్ ఇలా ఎవరి పేరూ లేకపోవడంలో ఎలాంటి నెగిటివ్ అంశం లేదు. తదుపరి వచ్చే పోస్టర్స్ లో అన్నీ ఉంటాయి అలాగే ఈరోజు అప్డేట్ లో పోస్టర్స్ తో సహా ఇతర టెక్నీకల్ టీం హ్యాండిల్స్ ని మేకర్స్ మెన్షన్ చేశారు. అందుకే ఎవరి పేరు మిస్ అయ్యింది ప్రచారం చేసినా అభిమానులు ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు