కల్కి 2898 ఎడి: సూపర్ స్టార్ బుజ్జి పై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

కల్కి 2898 ఎడి: సూపర్ స్టార్ బుజ్జి పై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

Published on May 23, 2024 2:50 PM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన తాజా చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ సినిమాని తన విజన్ తో ఇండియా లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా రూపొందించాడు. మరి పురాణాలకి సాంకేతికతకు ముడి పెట్టి ప్లాన్ చేసిన ఈ చిత్రంలో ఎన్నో వింతలూ విశేషాలు కూడా ఉన్నాయి.

మరి ఈ లిస్ట్ రీసెంట్ సెన్సేషన్ గా మారిన కొత్త సూపర్ స్టార్ బుజ్జి అందరిలో మంచి ఆసక్తిని రేకెత్తించింది. అలా నిన్న భారీ ఈవెంట్ లో బుజ్జి కార్ ని రివీల్ చేయగా దానికి విశేష స్పందన ఇప్పుడు వస్తుంది. అయితే అసలు మేకర్స్ స్టార్ట్ చేసిన స్క్రాచ్ ఎపిసోడ్స్ ని ఈ కార్ తాలూకా టైర్ డిజైన్ తోనే మొదలు పెట్టారు. మరి ఇక్కడ నుంచి నాగ్ అశ్విన్ తన టీం తో కలిసి ఒక భవిష్యత్ లో ఉండే కార్ ని ఎలా ఉంటుందో అన్నట్టు చూపించారు.

అయితే ఈ బుజ్జి కార్ సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇపుడు బయటకి వచ్చాయి. ఈ కార్ లో స్టార్టింగ్ చెప్పుకున్న టైర్ తోనే మొదలు పెడితే ఈ ఒక్క టైర్ రిమ్ సైజ్ నే 34.5 ఇంచులు ఉంది. టైర్ తో కలిపి ఇది దాదాపు ఒక మనిషిలో సగం ఉండేలా భారీ సైజు లో ఒక మాన్స్టర్ ట్రక్ తరహాలో డిజైన్ చేశారు. అలాగే ఈ కారుని ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు మహీంద్రా మరియు జయెమ్ మోటార్స్ వారు సంయుక్తంగా తయారు చేశారట.

అలాగే మొత్తంగా ఈ కారు బరువు ఏకంగా 6 టన్నుల బరువు ఉంటుందట. సో దీని బట్టి ఈ కారు బయట చూస్తే ఎంత భారీగా అనిపిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక దీనికి టార్క్ 9800 న్యూటన్ మీటర్లు ఉంటే ఆ కార్ 94 కిలో వాట్స్ పవర్ తో నడుస్తుంది. అలాగే ఈ కారు డిజైన్ లో మన దేశపు ఇంజినీర్స్ ముఖ్యంగా ఎక్కువ పాత్ర పోషించారు. మొత్తానికి అయితే నాగ్ అశ్విన్ అండ్ టీం చేసిన ఈ స్పెషల్ కారు ఇప్పుడు నేషనల్ వైడ్ మంచి హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తుండగా

సంబంధిత సమాచారం

తాజా వార్తలు