నిన్న హీరోయిన్ టబు పుట్టినరోజు సందర్భంగా అలవైకుంఠపురంలో మూవీ నుండి ఆమె లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేశారు. టబు గోర్జియస్ లుక్ కి మంచి స్పందన లభించింది. టబు లుక్ చాలా యంగ్ గా ఉండటంతో టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ గాసిప్స్ మొదలయ్యాయి. అదేమిటంటే టబు అలవైకుంఠపురంలో చిత్రంలో బన్నీ అక్కగా చేస్తున్నారని. గతంలోనే దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా విడుదలైన టబు లుక్ దానికి బలం చేకూర్చింది. మధ్యతరగతి కుటంబం నుండి గొప్పింటి కోడలిగా వెళ్లిన అమ్మాయిగా టబు పాత్ర ఉంటుందని సమాచారం.
ఇక పూజా హెగ్డే మరోమారు బన్నీ తో జతకడుతుండగా, సుశాంత్, నవదీప్, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ వంటి నటులు ఇతర కీలకపాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ యూరప్ లో పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. థమన్ స్వర కల్పనలో విడుదలైన రెండు పాటలు విపరీతమైన ఆదరణ దక్కించుకోవడం విశేషం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ స్వయంగా నిర్మిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.


