ఇంట్రెస్టింగ్..తమిళనాట “హను మాన్” ఈ 3 భాషల్లోనూ..

ఇంట్రెస్టింగ్..తమిళనాట “హను మాన్” ఈ 3 భాషల్లోనూ..

Published on Jan 17, 2024 2:00 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వచ్చిన ఓ చిత్రం అయితే పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతూ దూసుకెళ్తుంది. మరి ఆ సినిమానే “హను మాన్”. మన తెలుగు నుంచి మొట్టమొదటి సూపర్ హీరో సినిమాగా ఇది రిలీజ్ కి రాగా పాన్ ఇండియా భాషల్లో అయితే విడుదల అయ్యింది. ఇక ఈ చిత్రం తెలుగు సహా హిందీ భాషల్లో బాగానే రన్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ తమిళ నాట కూడా హను మాన్ స్ట్రాంగ్ హోల్డ్ ని కనబరుస్తుండడం విశేషం.

తమిళ నాట ఉన్న కొన్ని స్క్రీన్స్ లో అయినా కూడా హను మాన్ విడుదల అయ్యిన మూడు భాషల్లో కూడా ఈజీగా ఇపుడు 80 నుంచి 90 శాతం మేర బుకింగ్స్ తో అదరగొడుతుంది. ఇది కేవలం తమిళ్ డబ్బింగ్ లోనే కాకుండా తెలుగు సహా హిందీ స్క్రీన్స్ లో కూడా ఉండడం విశేషం. దీనితో తమిళనాడులో కూడా అంత పోటీలో హను మాన్ కూడా ఈ రేంజ్ పెర్ఫామెన్స్ ని కనబరచడం ఊహాతీతం అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు