ఇంట్రెస్టింగ్ : ఇండియాస్ బిగ్గెస్ట్ బ్రాండ్ గా ఐకాన్ స్టార్

ఇంట్రెస్టింగ్ : ఇండియాస్ బిగ్గెస్ట్ బ్రాండ్ గా ఐకాన్ స్టార్

Published on Apr 19, 2024 3:01 AM IST

టాలీవుడ్ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప 2 మూవీ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని ఆగష్టు 15న భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

ఇక మరోవైపు ఈమూవీ యొక్క నార్త్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 200 కోట్లకు జరుగగా, డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఇక సౌత్ తో పాటు ఇతర ప్రాంతాల హక్కులకు కూడా ఎంతో డిమాండ్ ఉంది. పుష్ప 1 మూవీలో తన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకున్న అల్లు అర్జున్ ఏకంగా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు సొంతం చేసుకోవడం విశేషం.

ఇక మరోవైపు పుష్ప 2 కి ఊహకందనంత భారీ స్థాయి బిజినెస్ జరుగుతుండడంతో పాన్ ఇండియన్ హీరోగా అల్లు అర్జున్ ఇండియాస్ బిగ్గెస్ట్ బ్రాండ్ గా కొనసాగుతున్నారు అని చెప్పాలి. ఇక పలు బ్రాండ్ లు సైతం అల్లు అర్జున్ తో తమ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం రెడ్ బస్, ర్యాపిడో, జొమాటో సహా పలు బ్రాండ్స్ కు ఆయన అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు