బన్నీ లారీ డ్రైవర్‌ గా కనిపించబోతున్నాడా ?

బన్నీ లారీ డ్రైవర్‌ గా కనిపించబోతున్నాడా ?

Published on Jan 11, 2020 3:00 AM IST

Allu sukumar

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఐతే తాజాగా ఈ సినిమాలో బన్నీ రోల్ గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. బన్నీ రఫ్ లుక్ లో ఒక లారీ డ్రైవర్‌ గా ఈ సినిమాలో నటించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో చూడాలి.

ఇక ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటం కారణంగా సినిమాలో చాల క్యారెక్టర్స్ ఉంటాయని.. ఆ క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ కొంతమంది కొత్త నటీనటులను ఈ సినిమా కోసం తీసుకున్నాడు. ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది. గతంలో కూడా సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ చిత్రాలను కూడా రివెంజ్ ఫార్ములాతోనే తీశారు. ఇప్పుడు కూడా బన్నీతో చేయబోయే సినిమా కూడా రివెంజ్ స్టోరీతోనే చేస్తున్నాడు.

‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి.

తాజా వార్తలు