పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజాది హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఆ అద్భుతమైన వింటేజ్ వండర్ పై అన్ని వర్గాల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి కొంత మేర షూట్ ను మేకర్స్ ఇటీవలే ప్లాన్ చేసి కోవిడ్ మూలాన ఆపేసిన సంగతి తెలిసిందే.
మరి ఇదిలా ఉండగా చాలానే సినిమాలు వాయిదా పడటం స్టార్ట్ అయ్యాయి. అయితే వేటి పై కూడా చాలా మేర అధికారిక కన్ఫర్మేషన్ లేదు కానీ కోవిడ్ పరంగా ఇదే పరిస్థితి కొనసాగితే మళ్ళీ భారీ చిత్రాలు వాయిదాలు తప్పవు. అలా రాధే శ్యామ్ కూడా వాయిదా పడుతుంది అని టాక్ మొదలయ్యింది.
కానీ మేకర్స్ మాత్రం అందుకు సుముఖంగా లేరని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్. అన్ని కరెక్ట్ గా ఉంటే ఆన్ టైం కి ఖచ్చితంగా రాధే శ్యామ్ వస్తుందట. ఎలాగో జూలై కి చాలా టైం ఉంది. ఆల్ మోస్ట్ అన్ని పనులు కూడా అయ్యిపోయాయి కనుక పరిస్థితులు చక్కబడితే రాధే శ్యామ్ అనుకున్న సమయానికి విడుదల కావచ్చు.
