ఇంట్రెస్టింగ్ ఇన్ఫో..తారక్ నెక్స్ట్ లో ఈ స్టార్ హీరోయిన్ ఫిక్స్.?

Published on Mar 21, 2021 5:21 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం లైన్ లో ఉండగానే తారక్ ఆల్రెడీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమాను ఒప్పుకున్నా సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ చిత్రంపై మళ్ళీ లేటెస్ట్ బజ్ మొదలయ్యింది.

అలా మరో ఆసక్తికర సమాచారం ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రంలో తారక్ సరసన లేటెస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ నటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆమెనే నేషనల్ క్రష్ రష్మికా మందన్నా. ఇప్పుడు పలు ఆసక్తికర సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరోయిన్ తారక్ నెక్స్ట్ కు ఆన్ కార్డ్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ త్రివిక్రమ్ కు మరియు రష్మికాకు చర్చలు అయ్యాయని కూడా తెలుస్తుంది. మరి దీనిపై ఓ అధికారిక క్లారిటీ ఒకటే బాకీ ఉంది. సో దాని కోసం వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :