ఇంట్రెస్టింగ్ గా నాని 32 మూవీ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ వీడియో

ఇంట్రెస్టింగ్ గా నాని 32 మూవీ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ వీడియో

Published on Feb 24, 2024 10:18 PM IST


నాచురల్ స్టార్ నాని హీరోగా తాజాగా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న మూవీ సరిపోదా శనివారం. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ నుండి నేడు రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అలానే నేడు నాని బర్త్ డే సందర్భంగా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఆయన చేయనున్న యాక్షన్ డ్రామా మూవీ యొక్క అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేసారు.

వయొలెంట్ మ్యాన్ ఒక్కసారిగా నాన్ వయొలెంట్ గా మారిపోతే అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ గ్లింప్స్ టీజర్ రూపొందింది. ఇక ఈ మూవీని కూడా డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తుండగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. ఈ గ్లింప్స్ లో యానిమేటెడ్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగున్నాయి. ప్రస్తతం ఈ గ్లింప్స్ కి అందరి నుండి మంచి రెస్సాన్స్ లభిస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ గురించిన మరిన్ని వివరాలు ఒక్కొక్కటిగా రానున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు