టాలీవుడ్ కి సరికొత్త అందాల ‘నిధి’.. !

Niddhi Agrwal

నిధి అగర్వాల్.. గతేడాది ‘మున్నా మైఖేల్’ అనే హిందీ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే నాగచైతన్య సరసన ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టి తన నటనతో వారిని మంత్ర ముగ్దుల్ని చేసింది. ఈ చిత్రంతో నిధి అగర్వాల్ తన అద్వితీయ నటనతో సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంది.

కాగా తొలి చిత్రంతోనే అందరిని ఆకట్టుకున్న ఈమెకి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాలు అంటున్నారు. బాలీవుడ్ లో తనదైన మార్క్ వేసుకున్న నిధి.. టాలీవుడ్ లోనూ అదే రీతిలో రాణిస్తానని అంటుంది.

ప్రస్తుతం నిధి అగర్వాల్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ఖచ్చితంగా ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయినట్లే అనిపిస్తోంది. తాజాగా అక్కినేని అఖిల్‌ ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలోనూ నిధి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మరో స్టార్ హీరో సినిమాలో కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version