‘వారణాసి’లో మహేష్ రోల్ కూడా ఇలాంటిదేనా? నమ్మేలా లేదే..

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ చిత్రమే వారణాసి. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు సహా ప్రపంచ ఆడియెన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు రోల్ పై ఓ రూమర్ ఇప్పుడు విరివిగా చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఓ బౌంటీ హంటర్ గా కనిపిస్తారు అని వినిపిస్తుంది.

ఇదే రోల్ లో ప్రభాస్ ఇటీవల కల్కి లో కనిపించిన సంగతి తెలిసిందే. దీనితో మహేష్ రోల్ పై కూడా ఈ రూమర్స్ మొదలు కావడం పైగా వారణాసి కూడా కల్కి తరహా కాన్సెప్ట్ కావడంతో చాలా పోలికలు మొదలయ్యాయి. కానీ అసలు అందులో ఎంత వరకు నిజం ఉంది అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ నిజమే అయినా జక్కన్న టేకింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో వారణాసి విషయంలో అభిమానులకి ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు.

Exit mobile version