‘దేవర’ క్లైమాక్స్ కి సైఫ్ రెడీ ?

‘దేవర’ క్లైమాక్స్ కి సైఫ్ రెడీ ?

Published on Feb 26, 2024 7:58 AM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. అక్టోబర్ 10న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఐతే, సైఫ్ అలీఖాన్ కి గాయం కారణంగా ఈ సినిమా క్లైమాక్స్ షూట్ ను పోస్ట్ ఫోన్ చేశారు. కాగా తాజాగా ఈ చిత్ర యూనిట్ క్లైమాక్స్ షూట్ కి సన్నాహాలు చేసుకుంటోంది. మార్చి రెండో వారం నుంచి ‘దేవర’ క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ మార్చి రెండో వారం నుంచి డేట్స్ ఇచ్చాడని టాక్.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. కాబట్టి.. ఈ సినిమా బ్యాలెన్స్ షూట్ వేగంగా జరగనుంది. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు