బైక్ పై మామా అల్లుళ్ళ సవారీ

venkymama

దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ వెంకీమామ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. వెంకటేష్, నాగ చైతన్య మామ అల్లుళ్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజపుత్ నటిస్తున్నారు. దసరా కానుకగా విడుదల చేద్దామని మొదట భావించినా కొన్ని అనివార్య కారణాల వలన ఈ చిత్ర విడుదల వాయిదాపడింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు.

కాగా మామ వెంకీ బుల్లెట్ వెనుక కూర్చుంటే అల్లుడు చైతూ నడుపుతూ పల్లెలో చక్కర్లు కొడుతున్న ఓ ఫోటో ఒకటి బయటికొచ్చింది. గాగుల్స్ పెట్టుకొని కలర్ఫుల్ డ్రెస్సులతో సరదాగా రైడుకెళుతున్న మామ అల్లుళ్లను చూస్తుంటే అదుర్స్ అనకుండా ఉండలేం. భారీ అంచనాలున్న ఈ చిత్ర విడుదల తేదీతో పాటు, టీజర్ ని త్వరలో విడుదల చేశే అవకాశం కలదు. ఇక వెంకీ మామ చిత్రానికి సంగీతం ఎస్ ఎస్ థమన్ అందిస్తున్నారు.

Exit mobile version