“దూత 2” లో “పొలిమేర” నటికి ఛాన్స్!?

“దూత 2” లో “పొలిమేర” నటికి ఛాన్స్!?

Published on May 2, 2024 10:30 PM IST

మన తెలుగు ఓటిటి కంటెంట్ లో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) మెయిన్ లీడ్ లో దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన థ్రిల్లింగ్ హారర్ వెబ్ సిరీస్ “దూత” కూడా ఒకటి. ప్రైమ్ వీడియోలో వచ్చిన ఈ సిరీస్ తెలుగులో అతి పెద్ద హిట్ కావడమే కాకుండా నాగ చైతన్య కి ఓటిటిలో సాలిడ్ డెబ్యూని ఇచ్చింది. అయితే ఈ సిరీస్ కి సీక్వెల్ ని కూడా మేకర్స్ రీసెంట్ గానే కన్ఫర్మ్ చేయగా దీనిపై అందరిలో మంచి ఆసక్తి స్టార్ట్ అయ్యింది.

ఇక ఈ సీక్వెల్ సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటి కామాక్షి భాస్కర్ల కీలక పాత్ర పోషించనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. విక్రమ్ కే కుమార్ చిత్రాల్లో కానీ తన నటీనటుల్లో కానీ ప్రతి ఒక్కరికీ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అందరికీ తెలుసు.

మరి ఈ టాలెంటెడ్ నటి దూత 2 లో ఎలాంటి పాత్రలో షైన్ అవుతుందో చూడాలి. ఇటీవల వచ్చిన థ్రిల్లర్ “పొలిమేర 2” (Polimera 2) కూడా ఆమె మంచి పెర్ఫామెన్స్ ని కనబరిచిన సంగతి తెలిసిందే. ఇక మరో పక్క చైతు తన “తండేల్” తో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు