‘గిల్లి’ రీ రిలీజ్ పై హీరోయిన్ త్రిష ఇంట్రెస్టింగ్ పోస్ట్

‘గిల్లి’ రీ రిలీజ్ పై హీరోయిన్ త్రిష ఇంట్రెస్టింగ్ పోస్ట్

Published on Apr 20, 2024 7:04 PM IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇళయదళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా ధరణి దర్శకత్వంలో 2004లో తెరకెక్కిన మూవీ గిల్లి. అంతకముందు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ తెరకెక్కించిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు కి ఇది రీమేక్. అప్పట్లో తమిళ్ లో గిల్లి కూడా పెద్ద విజయం అందుకుంది.

ఇక ఈ మూవీ రిలీజ్ అయి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తాజాగా దీనిని థియేటర్స్ లో రీ రిలీజ్ చేసారు. అయితే దాని పై హీరోయిన్ త్రిష స్పందిస్తూ, మళ్ళి అప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి, నిజానికి ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్ పీరియన్స్ గుర్తుకు వచ్చింది అంటూ త్రిష పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా గిల్లీ రీ రిలీజ్ కి మంచి రెస్పాన్స్ లభిస్తుండడంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు