ఆర్జీవీ ‘యానిమల్’ రివ్యూ పై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్

ఆర్జీవీ ‘యానిమల్’ రివ్యూ పై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్

Published on Dec 6, 2023 1:00 AM IST


బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ఆనిమల్. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయి ప్రస్తుతం సక్సెస్ తో కొనసాగుతోంది ఈ మూవీ. ఇక ఇటీవల ఆనిమల్ మూవీ చూసి ఎంతో బాగుందని అంటూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాని మెచ్చుకుంటూ ట్విట్టర్ లో తన రివ్యూ పోస్ట్ చేసారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

తాజాగా వర్మ ట్వీట్ కి దర్శకుడు సందీప్ రిప్లై ఇచ్చారు. మిస్టర్ రామ్ గోపాల్ వర్మ మాదిరిగా మరే ఇతర దర్శకుడు భారతీయ సినిమాకి సహకారం అందించలేదని నేను నమ్ముతున్నాను, నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ అయిన మీ నుండి రెండు విషయాలు మినహాయించి మీ శైలిలో అన్నింటికీ యానిమల్ మూవీకి మీరు అందించిన రివ్యూకి నిజంగా కృతజ్ఞతలు అంటూ సందీప్ రెడ్డి వంగా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు