‘పోచర్’ వెబ్ సిరీస్ పై సూపర్ స్టార్ మహేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

‘పోచర్’ వెబ్ సిరీస్ పై సూపర్ స్టార్ మహేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

Published on Feb 27, 2024 7:10 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. అతి త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తన కెరీర్ 29వ మూవీ అయిన SSMB 29 స్టార్ట్ చేయనున్నారు. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన సినీ, వ్యక్తిగత విషయాలు షేర్ చేసే సూపర్ స్టార్, తాజాగా ఒక మలయాళ వెబ్ సిరీస్ పై తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసారు. ఆయన పోస్ట్ చేసిన సిరీస్ పోచర్. మలయాళంలో రూపొందిన పోచర్ వెబ్ సిరీస్, ఫిబ్రవరి 23 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ నటి అలియా భట్ దీనికి నిర్మాతగా వ్యవహరించారు.

నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేంద్రు భట్టాచార్య ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి రిచీ మెహతా దర్శకత్వం వహించారు. కేరళ అడవుల నేపథ్యంలో నడిచే ఈ కథను ఇంట్రెస్టింగ్ కథనంతో 8 ఎపిసోడ్స్ గా చిత్రీకరించి విడుదల చేసారు. ఈ సిరీస్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తాజాగా ఈ సిరీస్ చూసి ఇంప్రెస్ అయిన మహేష్ బాబు ‘ఎవరైనా దీన్ని ఎలా చేయగలరు, వారి చేతులు వణుకవా, ఈ క్రైం యాక్షన్ థ్రిల్లర్ పోచర్ చూసిన తర్వాత ఇలాంటి ప్రశ్నలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి’ అంటూ మహేష్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు