మహేష్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీపై క్రేజీ రూమర్…!

మహేష్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీపై క్రేజీ రూమర్…!

Published on Nov 29, 2019 8:33 AM IST

anil

రైటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పటాస్ సినిమాతో దర్శకుడిగా మారారు అనిల్ రావిపూడి.కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయం అందుకోవడంతో డైరెక్టర్ గా సెటిలైపోయారు. ఇక ఈఏడాది ఎఫ్2 చిత్రంతో హిలేరియస్ కామెడీ పండించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆయన ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

ఐతే ఈ చిత్రం తరువాత అనిల్ చేయబోయే మూవీ గురించి ఆసక్తికర వార్త పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. అనిల్ తన నెక్స్ట్ మూవీ ఎనర్జిటిక్ హీరో రామ్ తో చేయబోతున్నారట. ఇప్పటికే ఈ మూవీ కథ రామ్ కి అనిల్ నేరేట్ చేయగా ఆయన సుముఖత వ్యక్తం చేశారని వినికిడి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ మాధ్యమాలలో ప్రముఖంగా వినిపిస్తుంది. కాగా రామ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు