‘సుకుమార్ – విజయ్’ సినిమా పై ఇంట్రస్టింగ్ రూమర్ !

Published on Oct 17, 2020 5:54 pm IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ కాంబినేషన్ లో ఎవ్వరూ ఊహించని విధంగా పాన్ ఇండియా సినిమాని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు మేకర్స్. కాగా ఈ సినిమా కథా నేపథ్యం గురించి ఒక ఆసక్తికరమైన రూమర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా పీరియాడిక్ మూవీ అని, పాకిస్తాన్ – ఇండియా విడిపోయిన కాలంలో జరిగిన అప్పటి పరిస్థుతుల ఆధారంగా జరిగే ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది.

అలాగే పాకిస్తాన్ – ఇండియా మధ్య జరిగిన యుద్ధం… ఆ యుద్ధంలో ఇండియా గెలుపు కోసం ఒక జవాన్ ఎంత గొప్పగా పోరాటం చేశారనే కోణంలో ఈ సినిమా సాగుతుందట. ఆ జవాన్ పాత్రలోనే విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో దాదాపు 150 కోట్ల బడ్జెట్లో నిర్మించనున్నారట. సుకుమార్ ‘పుష్ప’ సినిమా పూర్తవ్వగానే ఈ సినిమా మొదలుకానుంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ దాదాపు ఏడాది పాటు పూర్తి డేట్స్ ను కేటాయిస్తున్నారట.

కాగా ఇప్పటి ప్లాన్ ప్రకారం 2022లో సెట్స్ పైకి ఈ సినిమా వెళ్లనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుండటం.. పైగా కేదార్ సెలగంశెట్టి బన్నీకి అత్యంత సన్నిహితుడు కావడం కూడా ఈ సినిమా హైప్ కి బాగా ఉపయోగపడనుంది.

సంబంధిత సమాచారం :

More