రెండు భాగాలుగా రూపొందనున్న ‘ఎన్టీఆర్’ చిత్రం !

నందమూరి బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు తేజరూపొందిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఇటీవలే ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి జీవితం ఆధారంగా రూపొందుతోంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది.

ప్రారంభోత్సవ వేడుకలో మాట్లాడిన దర్శకుడు తేజ, బాలక్రిష్ణలు ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలంటే 2 గంటలు సరిపోదని, 6 గంటలైనా కావాలని, కానీ తమ టీమ్ ఎంతో కష్టపడి 2గంటలకు కథను కుదించామని కూడ అన్నారు. మరి ఈ వార్తల మేరకు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తారో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. విష్ణు ఇందురి, సాయి కొర్రపాటి, బాలక్రిష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.